Telugu Association of Greater Chicago

అధ్యక్షుని సందేశం

 

ప్రియాతి ప్రియమైన తెలుగు బంధు-మిత్రులందరికీ నా హృదయపుర్వక  నమస్కారాలు !!


గత 46 సంవత్సరాల నుండి చికాగో ప్రాంతంలో తెలుగువారికి సేవలు అందిస్తున్నామొట్టమొదటి విదేశీ తెలుగు సంస్థ టిఎజిసి (TAGC) సంస్థకు నా వంతు సేవ చేసే భాగ్యం కలిగినందుకు  గౌరవంగాను, ఆనందంగానూ ఉంది.  మీ అందరి ఆశిస్సులతో, సహాయ సహకారాలతో  ఈ సంవత్సరంకూడా ఒక ఉమ్మడి కుటుంభంల మనమందరమూ కలసి తెలుగు    భాష, సంస్కృతి, నడవడి, కట్టుబాట్లను పరిరక్షించే కార్యకలాపాలు, సమాజ సేవా కార్యక్రమాలు మరియు వివిద రంగాలలో యువత ప్రమేయం పెంచే కార్యక్రమాలు కొనసాగించాలని ఆశిస్తున్నాను.

తెలుగువారి అభిరుచులకు అణుగుణంగా, TAGC సంస్థ తనను తాను మలుచుకుంటూ, కొత్త తరానికి తెలుగు సాంప్రదాయాలను నూతన విధానాలతో పరిచయం చేయాలి అన్న ఆలోచనలతో మన సంస్థ కుటుంభ సభ్యులకు, మిత్రులకు మరియూ శ్రేయాభిలాశులకు పేరు పేరున ఆహ్వానాం పలుకుతున్నాను 

ప్రతి సంవత్సరంలాగే, మన ప్రధాన పండుగలు సంక్రాంతి, ఉగాది & శ్రీరామా నవమి, దీపావళి & దసరా మరియు బతుకమ్మలను ఒక  కుటుంభంలా కలిసి ఘనముగా జరుపుకొందాం. వ్యక్తిగతంగాను మరియూ కుటుంబ సభ్యుల ఆరోగ్యకరమైన జీవనప్రమాణలకు ​ పెంచడానికి​, కొత్త కొత్త మిత్రులని కలవటానికి  ఆటల పోటీలను ఒక సాధనంగా ఉపయోగిస్తుందాం. దేశభక్తిని చాటే గణతంత్ర మరియు స్వతంత్రదినోత్సవ కార్యక్రమాలలో పాల్గొనే వీలు కల్పించడము. 

మన ఆడ పడుచులు సాధించిన  సామాజిక,ఆర్థిక,సాంస్కృతిక మరియు రాజకీయ  రంగాలలో అభివృద్ధిని గుర్తించి ప్రపంచ మహిళాదినోత్సవాన్ని జరుపుకోవడంతో పాటు, మనన్ని చూడడానికి విచ్చేసిన తల్లిదండ్రులు మరియు అవసరమైన వారికీ వైద్య సేవలు అందిచడానికి వైద్య & ఆరోగ్య శిబిరాలలాంటి వాటికె పరిమితం కాకుండా, రక్తదాన శిబిరాలు మరియు అనేక స్వచ్ఛంద సమాజ సేవా కార్యక్రమాలను  ఇటు అమెరికా మరియు అటు భారతదేశాలలో మీ సహయ సహకారాలతో చేయాలని నా సంకల్పం. 

నేటి యువతే మన రేపటి నాయకులూ మరియూ మార్గదర్శకులు అనే నానుడిని ముందుకు తీసుకెళ్ళే  విధముగా, మన యువతను  వ్యక్తిగతంగాను, సమాజ పరంగాను మరియు రాజకీయంగా అభివృద్ధి వైపు ప్రయాణం చేయటానికి వీలుగా ​మార్గదర్శకతను పొందించే  కార్యక్రమాలను ప్రత్యేకంగా చేపట్టాలని నా ప్రణాళిక. మీ పిల్లలను, మన తెలుగు యువత కార్యక్రమాలలో పాల్గొనే విధముగా ప్రోత్సహించండి.

మన సంస్థ నిస్వార్థముగా నిర్విరామముగ అభివృద్ది చెందడానికి మరియు క్రొత్త క్రొత్త కార్యక్రమాలనూ జరిపించడానికి వీలుగా ఎంతో సహయ సహకారాలు అందిస్తున్న మన  సంస్థ ప్రాయోజకులకు (SPONSORS) నా హృదయ పూర్వాక వందనములు. వారు మనకు చేస్తున్న సహయ సహకారాలకు గుర్తించి మన వంతు సహాయముగా అంగడివీధిలొకి వెళ్ళే ముందు మన ప్రాయోజకుల (SPONSORS) సంస్థలు అందించే సేవలను గుర్తించి, వారి సేవలను ఉపయోగించుకోవాలని నా మనవి మరియు వారి గురించి మనకు తెలిసిన వారికి తెలియచేయటం మన బాధ్యతగా గుర్తించాలి. TAGC ఇమెయిల్ మరియు ఫేసెబుక్( సామజిక యానకం ) ల ద్వారా రాబోయే TAGC ప్రకటన చూసి కార్యక్రమాల గురించి తెలుసుకొ​ని పాల్గొనాలని నా మనవి.

చివరగా ఉల్లాసముగా, ఉత్సహాహముగా మరియు ఆనందముగా నడిచే మన సంస్థ ఈ సంవత్సర ప్రయాణములో సరదాగా మీరు, మీ కుటుంబ సభ్యులు మరియు మిత్రులు అన్ని కార్యక్రమాలలో పాల్గొని విజయవతం చేయాలి అని మనసారా కోరుకుంటున్నా​నూ. మన సంస్కృతీ సంప్రదాయాలను గురించి తెల్సుకోవటానికి, పరిరక్షించుకోవటానికి TAGCకి  నలుపది ఆరు  సంవత్సరాల సుదీర్గ చరిత్ర మరియు అనుభవమున్నసరైన చక్కని చుక్కనైన వేదిక అందుకే TAGC సంస్థలో సభ్యులుగా చేరండి మరియు తోటి  స్నేహితులని ప్రోత్సహించడం మన కర్తవ్యం.

TAGC  కుటుంబంలో సభ్యులుగా చేరండి ! మన తెలుగు జాతి అభ్యున్నతికై పాటుపడుము రండి !
మన సంస్కృతీ సంప్రదాయాలను గురించి తెల్సుకోవటానికి, పరిరక్షించుకోవటానికి TAGC సరైన వేదిక !!

మీ భవదీయుడు ,
-- రామచంద్రా రెడ్డి, ఏడే

Panchangam Read More

Join Mailing List

For Email Newsletters you can trust.

Follow Us on

Sponsors

 • International Legal and Business Services
 • Yoyo
 • Krishna Rangaraju
 • PMS Inc
 • Indian CPA
 • ambariCloud
 • Meda Dental
 • Cignus
 • Globalappz
 • Patel Brothers
 • Dayakar Jale
 • Bawatch
 • Pegasus
 • Mygo Consulting
 • Indsoft
 • Hyderabad House
 • India Bazar
 • Keerthi
 • Cool Mirchi
 • Masala Chicago
 • Hamzat Realty
 • Regal Jewels
 • NRI Alliances
 • Verinon

Member Login

 

Join Mailing List

For Email Newsletters you can trust.

Media Partners

 • _blank
 • _blank
 • _blank
 • _blank
 • _blank
 • _blank
 • _blank
 • _blank
 • _blank
 • _blank
Donate
Address: PO Box: 2424, Naperville, IL 60567. Tax ID # 23-7411880
Website Developed by
vaishnavidesign
Copyright © 2010-2017 Telugu Association of Greater Chicago. All rights Reserved.